టీఆర్ఎస్ నేతలకు అగ్నిపరీక్షలా మారిన మున్సిపల్ ఎన్నికలు

టీఆర్ఎస్ నేతలకు అగ్నిపరీక్షలా మారిన మున్సిపల్ ఎన్నికలు

trs

మున్సిపల్ ఎన్నికలు టీఆర్ఎస్ నేతలకు అగ్నిపరీక్షలా మారాయి. అభ్యర్థుల గెలుపు బాధ్యతను అధిష్టానం ఎమ్మెల్యేలకు అప్పగించింది. దీంతో ఓవైపు టిక్కెట్ల కేటాయింపులు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు. పైగా మొదట్నుంచి పార్టీలో కీలకంగా పనిచేసినవారికే టిక్కెట్లు కేటాయించాలని అధిష్టానం ఆదేశించింది. అయితే, ఆశావహులు ఎక్కువగా వుండటంతో టిక్కెట్ల కేటాయింపు తలకుమించిన భారంగా మారింది.

అటు అధిష్టానం నుంచి ఆర్థిక సాయం లేకపోవడంతో.. ఫైనాన్షియల్ గా సపోర్టు చేయలేమంటున్నారు ఎమ్మెల్యేలు. ఉద్యమ నేతలు సైతం ఎన్నికల ఖర్చులు పెట్టుకోలేని స్థితిలోవున్నారు. దీంతో ఆర్థికంగా బలమైన ఆశావహులు టిక్కెట్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story