డిగ్రీ, పీజీ అర్హతలతో జియోలో ఉద్యోగాలు..

టెలికామ్ దిగ్గజం రిలయెన్స్ జియో భారీగా ఉద్యోగాల భర్తీకి తెర తీసింది. డిగ్రీ, పీజీ విద్యార్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఫ్రెషర్స్, అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్, సేల్స్ ఆఫీసర్, సీనియర్ ఎంటర్‌ప్రైజ్ సేల్స్ ఆఫీసర్, డేటా ఇంజనీర్, డెవలపర్ అప్లికేషన్ ఇంజనీర్, బ్యాకెండ్ డెవలపర్..
ఈ ఉద్యోగాలకు బీఈ/బీటెక్, బీఎస్సీ, బీసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంగ్లీష్ భాషపై మంచి పట్టు ఉండాలి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్ వాడకం తెలిసి ఉండాలి. స్థానిక భాష తెలిసి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్‌మెంట్ స్కిల్స్ తెలిసి ఉండాలి. అభ్యర్థుల కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు. నిబంధన ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంస్ధ నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com