రెండోసారి అధ్యక్షులుగా కొనసాగనున్న లక్ష్మణ్‌?

రెండోసారి అధ్యక్షులుగా కొనసాగనున్న లక్ష్మణ్‌?

lakshman

సంస్థాగత ఎన్నికలపై పూర్తి దృష్టిసారించింది బీజేపీ. తెలంగాణతో పాటు ఆంధ్ర, కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి. గత ఏడాది 31 లోపు రాష్ట్ర అధ్యక్షుల్ని ఎంపిక చేయాల్సి ఉండగా ఇప్పటికీ అది కొలిక్కి రాలేదు. ఇప్పుడిప్పుడే జిల్లా అధ్యక్షుల ఎన్నిక పూర్తవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఓ వైపు హోంమంత్రిగా బాధ్యతలు నెరవేరుస్తూనే మరోవైపు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. అదే సమయంలో కీలక బిల్లులను పార్లమెంట్‌లో తెచ్చి వాటి అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఫలితంగా అనుకున్న సమయంలో సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయలేకపోతున్నారు.

కొత్త ఏడాదిలో జనవరి వచ్చేసింది. అయినా.. జిల్లా అధ్యక్షుల ఎన్నిక పెండింగ్‌లోనే ఉంది. జిల్లా అధ్యక్షుల ఎన్నికల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికతో పాటు ఇతర పార్టీ సంస్థాగత నిర్మాణాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్ర అధ్యక్షుల్ని కొనసాగించాలనే ఆలోచన ఉంది బీజేపీ హైకమాండ్‌. దీంతో.. ప్రస్తుతం తెలంగాణలో అధ్యక్షులుగా ఉన్న లక్ష్మణ్‌ మరోసారి అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత పార్లమెంట్‌లో నలుగురు ఎంపీలును గెలిపించటం, స్థానిక సమస్యలపై యాక్టివ్‌గా పోరాటం చేయడం, పార్టీ సీనియర్లను కలుపుకునిపోవడం వంటి లక్షణాలు.. లక్ష్మణ్‌కు ప్లస్‌ పాయింట్లుగా మారాయి.

సంక్రాతి లోపు జిల్లా అధ్యక్షుల ఎన్నికల పూర్తి చేసుకుని మార్చి 15 లోపు రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పూర్తి చేసుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. దీంతో తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌ను మరో టర్మ్‌ కొనసాగించనున్నారు.

పార్టీ సంస్థగత ఎన్నికలు మార్చి 30 లోపు పూర్తి చేయాలని భావిస్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలో.. జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌షానే కొనసాగుతారని, సంస్థాగత ఎన్నికలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story