నిజంగానే.. 20 పైసలకు టీ షర్ట్..

నిజంగానే.. 20 పైసలకు టీ షర్ట్..

20 పైసలకు టీషర్ట్ ఏంటండి.. మరీ చిత్రం కాకపోతే.. 20 పైసల బిళ్ల నా చిన్నప్పుడెప్పుడో చూశాను.. అయినా ఇప్పుడు దాన్నెక్కడ తెచ్చేది. కనీసం కర్చీఫ్ కొనాలన్నా రూ.20లు లేందే దొరకదు. అలాంటిది 20 పైసలకు టీ షర్ట్ ఎవరిస్తున్నారండి ఇంతకీ అంటే.. తమిళనాడులోని తిరుత్తణిలో ఉన్న వస్త్ర దుకాణ యజమాని కొత్త సంవత్సరంలో కొనుగోలు దారులను ఆకర్షించడానికి ఓ చిన్న ప్లాన్ వేశారు. చెలామణిలో లేని 20 పైసల నాణెం తెస్తే రూ.300 విలువ చేసి టీ షర్ట్ ఇస్తామని ప్రకటించాడు. నాణేలు సేకరించడం అతడి హాబీ. అందులో భాగంగానే ఈ ప్రకటన. అది చూసి షాపుకి జనం క్యూకట్టారు. ఊహించని ఈ పరిణామానికి యజమాని వెంటనే మొదటి వందమందికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని అన్నారు. టీ షర్ట్ దక్కించుకోని వారు యజమానిపై విరుచుకుపడ్డారు. ముందే పరిస్థితిని ఊహించి ప్రకటనలు వేయాలని అన్నారు.

Next Story