వైఎస్‌ వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగవంతం..

వైఎస్‌ వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగవంతం..

ys-viveka

వైఎస్‌ వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగవంతం వేశారు సిట్‌ అధికారులు. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి కడపలో ఉన్న...టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని.. కొమ్మా పరమేశ్వర్‌ రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. నగరంలోని హరిత హోటల్‌లో ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని పరమేశ్వర్‌ రెడ్డి కలిసిన ట్లు తెలుస్తోంది . ఈ కేసులో.... మొదటి నుంచి పరమేశ్వర్‌ రెడ్డిని కీలక నిందితుడిగా అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో ఇదే అంశంపై హరిత హోటల్‌లో విచారిస్తున్నారు సిట్‌ అధికారులు. వీరిద్దరూ ఏం చర్చించారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. హోటల్‌లో రికార్డులను పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన మార్చ్ 14న హరిత హోటల్‌ రూమ్‌ నెం.104లో బీటెక్‌ రవి బస చేసినట్లు తెలుస్తోంది. దీంతో హరిత హోటల్‌ సీసీ ఫుటేజ్‌ ఇవ్వాలని మేనేజర్‌ను కోరారు సిట్‌ అధికారులు. పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌ నేతృత్వంలో.. ఐదుగురు సీఐలు, ఇద్దరు ఎస్సైలతో హరిత హోటల్‌లో విచారణ సాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story