రాజధానిపై రెండు రిపోర్ట్‌లపై స్టడీ.. 20వ తేదీ కల్లా తుది నివేదిక

రాజధానిపై రెండు రిపోర్ట్‌లపై స్టడీ.. 20వ తేదీ కల్లా తుది నివేదిక

bostan

రాజధాని అమరావతిపై బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ తుది నివేదికను ఏపీ సీఎం జగన్‌కి అందజేసింది. సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్‌ను కలిసిన బీసీజీ ప్రతినిధులు నివేదికను అందజేసి.. అందులో అంశాలను పూర్తిగా వివరించారు. రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌.. గతంలో ఓ మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం రాజధానులుగా అమరావతి, విశాఖ, కర్నూలు నగరాలకు ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలపై ఫోకస్ చేస్తూ బీసీజీ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.

బహుళ రాజధానులు ఉన్న రాష్ట్రాలపై కమిటీ అధ్యయనం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నివేదికలో పాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం తీసుకోవాలని చర్యలను సూచించినట్టు సమాచారం. పరిపాలన వికేంద్రీకరణ ఎలా జరిగాలి..? ఏం ప్రాంతం దేనికి అనుకూలం.. అమరావతి ప్రాంత అభివృద్ధి తదితర అంశాలను ఈ నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ సూచనల మేరకు ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, సాంకేతిక అంశాలపైనా రిపోర్ట్‌ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

బీసీజీ ఇచ్చిన నివేదికతో పాటు. గతంలో జి.ఎన్‌ రావు ఇచ్చిన కమిటీపైన.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో వేసిన హైపర్‌ కమిటీ అధ్యయనం చేయనుంది. రెండు కమిటీల నివేదికను పరిశీలించి.. తరువాత ఈ నెల 8న ఏపీ కేబినెట్ సమావేశంలో వాటిపై చర్చించనున్నారు. ఈ 2 రిపోర్ట్‌లను స్టడీ చేసి.. 20వ తేదీ కల్లా తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉంది..

రిపబ్లిక్ డే తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా.. ప్రభుత్వం ఈ 3 రిపోర్ట్‌లు సభ ముందు ఉంచబోతోంది. సుదీర్ఘ చర్చ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే.. రాజధానుల అంశంపై హైపవర్ కమిటీ నివేదిక వచ్చాక.. అఖిలపక్షం సమావేశం నిర్వహించే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజధానిపై పూర్తి స్పష్టతకు వచ్చిన సీఎం జగన్‌.. ఈ నెలలోనే రాజధాని మార్పుపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

Tags

Next Story