ఆంధ్రప్రదేశ్

తిరుపతిని రాజధానిగా ప్రకటించాలి: మాజీ మంత్రి

తిరుపతిని రాజధానిగా ప్రకటించాలి: మాజీ మంత్రి
X

amarnath

తిరుపతిని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి. రాజధానికి టెంపుల్‌ సిటీ తిరుపతి అనువైన ప్రాంతమన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టి ముగ్గురు ముఖ్యమంత్రులను పెట్టాలని డిమాండ్‌ చేశారు. సీఎం నిర్ణయం రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజల మధ్య చిచ్చు రేపేలా ఉందన్నారు. జగన్‌కు ఎవరిపైన కోపమని ప్రశ్నించారు. రాజధానిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట.. అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్‌కు ఎందుకు ఓటేశామా అని ఇప్పుడు ప్రజలు తలలు పట్టుకుంటున్నారని విమర్శించారు. సోషల్‌ మీడియాలో టీడీపీపై దుష్ర్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES