దుబాయ్ 'బ్లూ డైమండ్ వర్కర్స్' క్యాంపు లో నూతన సంవత్సర వేడుకలు

దుబాయ్ బ్లూ డైమండ్ వర్కర్స్ క్యాంపు లో నూతన సంవత్సర వేడుకలు

mp-arvindh

దుబాయ్ లోని సోనాపూర్ లో 'బ్లూ డైమండ్ వర్కర్స్' క్యాంపు లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ వేడుకలు బీజేపీ తెలంగాణ UAE NRI సెల్ ఆధ్వర్యంలో జరిగాయి. నూతన సంవత్సరం సంధర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధర్మపురి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన తోపాటు ఇండియన్ వైస్ కాన్సుల్ జనరల్ జస్పాల్ అహుజా, IPF టీం సభ్యులు, మిడిల్ ఈస్ట్ NRI సెల్ ఇంచార్జ్ నరేంద్ర పన్నీరు, తెలుగు సంఘాల నాయకులు,వివిధ రంగాలకి చెందిన పలువురు ప్రముఖులు, 300 మంది పైగా కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎంపీ అరవింద్ మాట్లాడారు.. కుటుంబానికి ఉపయోగ పడేలా ఫైనాన్సియల్ ప్లానింగ్ తయారు చేసుకోవాలని కార్మికులకు సూచించారు. ప్రవాస భారతీయులతో కలిసి న్యూఇయర్ వేడుకలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నారైలు గర్వపడేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలన కొనసాగుతుందన్నారు ఎంపి అరవింద్. కాగా ఈ కార్యక్రమం అనంతరం ఎంపీ అరవింద్ కార్మికుల కష్టాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story