ఆంధ్రప్రదేశ్

అమరావతికి మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం.. జేఏసీ ఏర్పాటు

అమరావతికి మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం.. జేఏసీ ఏర్పాటు
X

amaravati

అమరావతి రాజధానికి మద్దతుగా ఏపీలో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో.. టీడీపీ స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, జనసేన పార్టీ నేత చేగొండి ప్రకాశ్‌తోపాటు కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని రక్షణ పోరాటానికై జేఏసీని ఏర్పాటు చేసి స్థానిక డాక్టర్‌ వర్మను అధ్యక్షునిగా నియమించారు.

రౌండ్‌ టేబుల్‌ సమావేశం తర్వాత.. సేవ్‌ అమరావతి.. సేవ్‌ రాజధాని అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, బాబూ జగ్జీవన్‌రావు విగ్రహాలకు పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు.

Next Story

RELATED STORIES