‘ఉత్తర’ మూవీ రివ్యూ

‘ఉత్తర’ మూవీ రివ్యూ

utthara

విడుదల తేదీ : జనవరి 03, 2020

నటీనటులు : శ్రీరామ్, కరోణ్య కట్రిన్, అజయ్ ఘోష్, టిల్లు వేణు,అధిరే అభి తదితరులు

దర్శకత్వం : తిరుపతి ఎస్ ఆర్

నిర్మాత‌లు : శ్రీపతి గంగదాస్, తిరుపతి ఎస్ ఆర్

సంగీతం : సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫర్ : క్రాంతి కుమార్ కె

ఎడిటర్: బి. నాగేశ్వర రెడ్డి

ప్రతి బాషకు ఒక సొగసుంటుంది.. అలాగే ప్రతి ఊరిలో చాలా ప్రేమకథలుంటాయి. వాటిని తెరమీదకు సహాజంగా తెచ్చిన సినిమాలు చాలా తక్కువుగా ఉంటాయి. అలాంటి వాటిలో ‘ఉత్తర’ ఒకటిగా ఉండబోతుందనే ఫీల్ ని ట్రైలర్ తో కలిగింది. మరి ఈ పల్లెటూరి ప్రేమకథ ఎంత వరకూ ఆకట్టుకందో చూద్దాం...

కథ:

తన తోటి స్నేహితులతో బాద్యతలు లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే అశోక్ (శ్రీరామ్) కి అదే ఊరిలో ఉండే స్వాతి (కారుణ్య ) ని ఇష్టపడతాడు. వారి ప్రేమ ను ఇంట్లో వారు అర్ధం చేసుకోరని లేచిపోదామని నిర్ణయించుకుంటారు. కానీ స్వాతి తండ్రి చెప్పిన మాటలతో ఆనిర్ణయం తప్పని ఇక్కడే ఉండే ఇంట్లో వారిని ఒప్పించి పెళ్ళి చేసుకుందామనుకుంటారు. అశోక్ ని ప్రయోజకుడు కావాలని, తన తండ్రి మెచ్చే వాడిగా మారాలని స్వాతి ప్రయత్నిస్తుంటుంది. ఆ క్రమంలో లంకె బిందెల గురించి తెలుసుకుంటాడు. కానీ అవి ఎప్పుడో చనిపోయిన ఉత్తర ఇంట్లో ఉంటాయి. అశోక్ వాటికోసం ప్రయత్నిస్తుంటాడు.. ఆ విషయం తెలసుకొన్న ఆఊరిలోని వ్యాపారి( అజయ్ ఘోష్) ఆ నిధులను దక్కించుకోవాలనుకుంటాడు. మరి నిధులు ఎవరికి దక్కాయి..? అసలు ఉత్తర కథేంటి..? స్వాతి, అశోక్ ల ప్రేమ గెలించిందా ..? లేదా అనేది మిగిలిన కథ..?

కథనం:

తెలంగాణా పల్లెదనం తెరమీద పరిచిన సినిమా ‘ఉత్తర’. ఊళ్ళు అనగానే పచ్చగా ఉండే పోలాలు.. అమాయకంగా కనపడే మోహాలు కాకుండా ఆ ఊరిని నాచురల్ గా చూపించడంలో దర్శకు తిరుపతి యస్ ఆర్ సక్సెస్ అయ్యాడు. చిన్నతనం నుండి పెరిగిన స్నేహితులు మీద తీసుకున్న పాట చాలా బాగుంది. పల్లెటూరి ప్రేమకథలు ఎలా మొదలవుతాయో చాలా నాచురల్ గా తెరమీదకు తెచ్చాడు దర్శకుడు. హీరో శ్రీరామ్ నిమ్మల తొలిపరిచయం అయినా అలా ఎక్కడా కనిపించలేదు..ఎవర్నీ అనుకరించకుండా తన ఓరిజినల్ టాలెంట్ తో పాత్రకు మరింత సహాజత్వం అద్దాడు. లవ్ ప్రపోజల్ సీన్ ని చాలా చక్కగా చేసాడు.. అలాగే ఎక్కడా డైలాగ్స్ కి ప్రత్యేకమైన ప్రాసలు అద్దకుండా చాలా రియలిస్టిక్ గా ఉండేలా చూసాడు దర్శకుడు అందుకే వారి మాటలు కూడా సహాజంగా అనిపించాయి. సినిమా మొదటి పదినిముషాలు వేణు, అభయ్ , అదిరే అభి ల కాంబినేషన్ సీన్స్ బాగా ఎంటర్ టైన్ చేసాయి. తర్వాత వీరి ప్రేమకథలో నాచురాలిటీ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. కారుణ్య తన నటనతో స్వాతి పాత్రను మరింత అందంగా మలిచింది. కళ్ళతోనే ఏ భావాలన్నీ పలికించగల కారుణ్య స్వాతి పాత్ర ను మరో స్థాయికి తీసుకెళ్ళింది. టీనేజ్ లో ఉండే అమాయకత్వం, అతి తెలివి కలబోసిన పాత్రతో యూత్ నా బాగా ఆకట్టుకుంది. ఇక ప్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన నటులు కూడా చాలా బాగా చేసారు. వారి మద్య సన్నివేశాలు చాలా సరదాగా సాగాయి. ‘ ఓ చూపే చుక్కల ముగ్గలా’ పాటను చాలా బాగా పిక్చరైజ్ చేసాడు దర్శకుడు. పాటలు అనగానే కథకు సంబంధం లేని లోకేషన్స్ చూడటం అలవాటయిన ప్రేక్షకులకు ఈ పాట కథలో బాగంగా మారింది. అసలు కథను కట్ చేయకుండా పినిష్ చేయగలిగాడు దర్శకుడు. ఇక ‘పిల్లనా గుండెను పట్టి లాగకే దారం కట్టి’ పాట థియేటర్స్ లో ఊపు తె్చింది. కారుణ్య మూమెంట్స్ లో ని గ్రేస్ ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథ అనడం కంటే చాలా సహాజంగా అనిపించే ప్రేమకథలో కారుణ్య, శ్రీరామ్ లో పాత్రలుగా మారారు. సెకండాఫ్ కొచ్చేసరికి దర్శకుడు కథలో తీసుకున్న టర్న్స్ లో హార్రర్,థ్రిల్లర్స్ మిక్స్ అయి ప్రేక్షకుల్ని కన్ ఫ్యూజ్ చేసాయి. అప్పటి వరకూ ఆకట్టకున్న ప్రేమకథలో ఇవి కాస్త జర్క్ గా అనిపించాయి. అజయ్ ఘోష్ పాత్రతో అలవాటయిన కామెడీని పండించాడు దర్శకుడు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ ని బాగా హ్యాండిల్ చేసాడు. మొత్తంగా ‘ఉత్తర’ లో ప్రేమకథ సహాజంగా అందంగా ఉంది.

చివరిగా:

అణువణువునా సహాజత్వం నింపుకున్న ప్రేమకథగా ‘ఉత్తర’ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. శ్రీరామ్,కారుణ్య ల నటన ఆకట్టుకుంటుంది. ఒక నిజాయితీతో కూడిన ప్రయత్నం చేసిన దర్శకుడు తిరుపతి యస్ ఆర్ తన ముద్రను తెరపై వేయగలిగాడు.

Tags

Read MoreRead Less
Next Story