మనసున్న మా 'లక్ష్మి'.. రూ.300 కోట్ల ఆస్తిని దానం..

మనసున్న మా లక్ష్మి.. రూ.300 కోట్ల ఆస్తిని దానం..

building

డబ్బు ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. దాచినకొద్దీ దాచుకోవాలనిపిస్తుంది. డబ్బు సంపాదించే క్రమంలో తమ స్థాయిని దిగజార్చుకోవడానికి కూడా వెనుకాడరు. తరాలు కూర్చున్న తరగని సంపద ఉన్నా బుద్ది గడ్డితిని లంచం కోసం చేయి చాస్తారు. అక్రమాలకు పాల్పడి అన్యాయంగా సంపాదిస్తుంటారు. అదే దానం చేయాలంటే మాత్రం ఎంతో పెద్ద మనసు ఉండాలి. అది అందరికీ సాధ్యం కాదు.. మనసున్న మారాజులకి, మాలక్ష్మిలకు మాత్రమే సాధ్యం.

సిలికాన్ సిటీ బెంగళూరు నడిబొడ్డున ఉన్న గాంధీనగర్‌లో మీరానాయుడికి రూ.300 కోట్ల విలువ చేసే హోటల్ ఉంది. వాణిజ్య వాపార కేంద్రాలకు దగ్గరలో ఉన్న ఏరియా కావడంతో చాలా మంది ప్రముఖులు, వ్యాపార వేత్తలు ఈ బిల్డింగ్ కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. అయితే దీన్ని అమ్మడానికి తన మనసు అంగీకరించడం లేదని తన భర్త శ్రీనివాస నాయుడు జ్ఞాపకార్థం దానం చేయాలనుకున్నారు. ఆయన ఎంతో కష్టపడి కట్టించారు ఈ హోటల్. ఆయన మరణం తరువాత ఇక్కడ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ హోటల్‌లో ఆతిధ్యం స్వీకరించారు. రూ.300 కోట్లు చెల్లించి కొనుగోలు చేయడానికి చాలా మంది ముందుకు వచ్చినా తిరస్కరించారు మీరా నాయుడు. కేన్సర్‌ చికిత్ప నిమిత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద పిల్లల కోసం ఆ భవనాన్ని కేటాయించాలని ఆమె నిర్ణయించారు. దీంతో పేదలకు ఉచితంగా చికిత్స అందిస్తున్న శంకర్ కేన్సర్ హాస్పిటల్‌కు దానంగా ఇచ్చారు.

తన భర్త గౌరవార్థం ఈ భవనాన్ని పేద పిల్లలకు దానం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. వైద్యం కోసం నగరానికి వచ్చే పేద కుటుంబాలు ఆశ్రయం కోసం ఎన్ని ఇబ్బందులు పడతారో నాకు తెలుసు. అలాంటి వారి కోసం ఉపయోగిస్తే మనసుకి తృప్తిగా అనిపిస్తుందని అన్నారు.

Read MoreRead Less
Next Story