7 గంటలుగా పోలీస్‌ స్టేషన్‌లో 'జేసీ' ని విచారిస్తున్న పోలీసులు

7 గంటలుగా పోలీస్‌ స్టేషన్‌లో జేసీ ని విచారిస్తున్న పోలీసులు

jc-diwakarreddy

అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దాదాపు 7 గంటలుగా పోలీస్‌ స్టేషన్‌లో జేసీ దివాకర్‌రెడ్డిని విచారిస్తున్నారు పోలీసులు. కండీషన్‌ బెయిల్‌పై విచారణ చేస్తున్నారు. మరోవైపు స్టేషన్‌ బయట హైటెన్షన్‌ నెలకొంది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథిని సైతం పోలీస్‌ స్టేషన్‌లో అనుమతించడం లేదు. జేసీపై ఐపీసీ సెక్షన్‌ 153-ఏ, 306 ప్రకారం కేసులు నమోదు చేశారు పోలీసులు. కండీషన్‌ బెయిల్‌పై విచారణ జరుపుతున్నారు...

టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా జేసీ.... పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులపైనా గంజాయి, సారాయి కేసులు పెడ్తామన్నారు. దీనిపై పోలీసులు అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు రూరల్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. దీంతో కోర్టును ఆశ్రయించిన జేసీ.. షరుతులతో కూడిన ముందుస్తు బెయిల్‌తో తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి రెండో ఆదివారంతో పాటు నాలుగో ఆదివారం పదిగంటల నుంచి నాలుగు గంటలలోపు స్టేషన్‌లో హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఇకపై పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇవాళ అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో హాజరయ్యారు దివాకర్‌రెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story