భార్యాభర్తలిద్దరికీ నెలకు రూ.20,000 పెన్షన్ కావాలంటే..
కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్‌ను అందిస్తోంది. అన్ని వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి. మోదీ ప్రభుత్వం 2015లో ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ.5,000 పెన్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పరిమితిని రూ.10,000 పెంచాలని పీఎఫ్‌ఆర్‌డీఏ ప్రతిపాదించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది.
అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరేందుకు 40 ఏళ్ల వరకు వయసు ఉన్న వారికే అనుమతి ఉంది. వయసు పరిమితిని 60 ఏళ్లకు పెంచాలనే డిమాండ్ కూడా ఒకటి తెరపైకి వచ్చింది. వయసు పరిమితిని పెంచితే మరింత మంది ఈ స్కీమ్‌లో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్కీమ్ నియమ నిబంధనల ప్రకారం భార్యాభర్తలిద్దరూ అటల్ పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు. ఇద్దరూ చెరొక ఖాతాను తెరవొచ్చు.
అప్పుడు ఇద్దరికీ ప్రతినెలా ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.10,000 వస్తుంది. ఒకవేళ మోదీ ప్రభుత్వం పెన్షన్ పరిమతిని పెంచితే రూ.20,000 వస్తాయి. 30 ఏళ్ల వయసులో ఉన్న భార్యాభర్తలిద్దకూ ఈ స్కీమ్‌లో చేరితే అప్పుడు వీరిద్దరూ వారి అకౌంట్లలో ప్రతి నెలా రూ.577 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. పెన్షన్ పరిమితి పెరిగినట్లైతే నెలవారీ చెల్లించే మొత్తం రూ.,1,154కు పెరుగుతుంది,
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com