ఎస్‌బీఐ పర్సనల్ లోన్.. జీతం రూ.15,000 ఉంటే 20 లక్షల రుణం

మీకు నెల జీతం రూ.15 వేలు ఉన్నా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియాలో రూ.20 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు తక్కువ ఉంటుంది. హిడెన్ చార్జీలు జీరో. రెండో లోన్ కూడా తీసుకోవచ్చు. ఎలాంటి సెక్యూరిటీ కానీ గ్యారంటీ కానీ చూపించాల్సిన అవసరం లేదు. లోన్ పొందాలనుకుంటే ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉంటే సరిపోతుంది. జీతం రూ.15,000 తప్పనిసరిగా ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్, పలు కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వారు లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ పర్సనల్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 1.5 శాతంగా ఉంటుంది. అయితే తీసుకున్న రుణాన్ని 6 నెలల నుంచి 6 ఏళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు 11.5 శాతం నుంచి ప్రారంభమవుతుంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com