రాజధానిగా అమరావతే ఉండాలి: అమరావతి పరిరక్షణ సమితి

X

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. బాలాజీ చెరువు జంక్షన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెబుతున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేస్తుంటే వారిపై పోలీసులను ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
