క్రైమ్

లవర్ మాట్లాడలేదని లాయర్ ఆత్మహత్య

లవర్ మాట్లాడలేదని లాయర్ ఆత్మహత్య
X

lawyer

ఇద్దరూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమ పెద్దలకు తెలిసింది. ఈ నెల 27న ముహుర్తం ఫిక్స్ చేశారు పెద్దలు. ఇంతలోనే కాబోయే పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అబ్బాయి లాయర్.. కూతురు మంచి వాడ్నే ప్రేమించింది అనుకుని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమ్మాయి తల్లిదండ్రులు. ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుంటామంటున్నారు. కాదంటే గొడవలు, ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవడం.. ఇదంతా ఎందుకు అమ్మాయి బాగానే ఉంది కదా అని అబ్బాయి తరపు వారు కూడా పెళ్లికి ఓకే చెప్పేసారు.

ఇరు కుటుంబాల పెద్దలు కలిసి మాట్లాడుకుని మంచి ముహుర్తం నిర్ణయించారు. పుదుచ్చేరిలోని కనకచెట్టి కుళం ప్రాంతానికి చెందిన సురేష్ న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నాడు. ఆ సమయంలోనే సహ విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇంతలో యువతి సురేష్‌తో మాట్లాడడం మానేసింది. కారణం తెలియదు.. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు.

దీంతో తీవ్రమనస్థాపం చెందిన సురేష్ గురువారం రాత్రి ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. నువు నాతో ఎందుకు మాట్లాడట్లేదు.. నాకు చాలా బాధగా ఉంది. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను చూడు.. అంటూ ఆమె చూస్తుండగానే కుర్చీపై నిల్చుని మెడకు తాడు బిగించుకుని సెల్ ఆఫ్ చేశాడు. సురేష్ చర్యతో కంగుతిన్న యువతి వెంటనే అతడి ఇంటికి సమీపంలో ఉన్న శివశక్తి అనే వ్యక్తికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అతడు వచ్చి సురేష్ తల్లిదండ్రులకు చెప్పాడు.

వాళ్లు పరుగున వెళ్లి సురేష్ గది తలుపు తట్టారు. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈలోపు కడలూరులో ఉంటున్న సదరు యువతి కూడా పుదుచ్చేరికి చేరుకుని సురేష్ ఇంటికి వచ్చింది. పోలీసులు ఆమెను కూడా విచారిస్తున్నారు. సురేష్ ఆత్మహత్యకు యువతి మాట్లాడక పోవడమేనా లేక మరేదైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.

Next Story

RELATED STORIES