స్టార్ డమ్ వాల్యూ ని బీట్ చేసిన 'రాజుగారి గది 3' రేటింగ్స్..

స్టార్ డమ్ వాల్యూ ని బీట్ చేసిన రాజుగారి గది 3 రేటింగ్స్..

Raju-gari-gadi

డిజిటల్ రివల్యూషన్ లో స్టార్ వాల్యూ ఉన్న సినిమాలకు డబుల్ డిజిట్ టిఆర్ పి లు రావడం చాలా అరుదుగా మారింది. స్టార్ వాల్యూ యాడ్ అయినా, సూపర్ హిట్ ట్యాగ్ లైన్ లు ఉన్నా కూడా డబుల్ డిజిట్ రావడం గగనంగా మారింది. ‘రాజుగారి గది 3’ టిఆర్‌పిలలో డబుల్ డిజిట్ ని సాధించడంతో ఇప్పడు ఆ రేటింగ్ టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ మూడో వారంలో స్టార్ మా లో ప్రదర్శించబడిన ‘రాజుగారి గది 3’ కి 11.6 టిఆర్ పి ని సాధించి ఈ సినిమా కంటెంట్‌కి ఉన్న సత్తాని మరోసారి చాటింది.

‘రాజుగారి గది 3’ ప్రదర్శించిన రోజు ఇండియా, వెస్టిండీస్ కి ఫైనల్ మ్యాచ్ ఉన్నా ఈ రేటింగ్ సాధించడం తో స్టార్ మా టీం కూడా ‘రాజుగారి గది 3’ టీం ని అభినందించింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించి గతేడాది హిట్ సినిమా లలో ఒకటిగా నిలిచింది. రాజుగారి గది కి హార్రర్ బ్యాక్ డ్రాప్ ఉన్నా దాన్ని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఓంకార్ మలిచాడు. అందుకే ఆ రేంటింగ్స్ సాధించగలిగింది అని విశ్లేషకులు అంటున్నారు.

రిపీట్ గా సినిమాని చూసి ఆనందించగలిగే కంటెంట్ ని ఇవ్వడంలో ‘రాజుగారి గది 3’ టీం సక్సెస్ అయ్యిందని ఈ రేటింగ్స్ మరోసారి నిరూపించాయి. హీరో అశ్విన్ సోలో గా సాధించిన సక్సెస్ వెండితెరమీదే కాకుండా బుల్లితెరమీద కూడా కంటిన్యూ అయ్యింది.

Read MoreRead Less
Next Story