బీసీజీ నివేదికపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
బీసీజీ నివేదికపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. బీసీజీ నివేదిక ఓ బూటకమన్నారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపుకు అసలు తలా లోకా ఉందా అని ప్రశ్నించారు. బీసీజీ గ్రూప్‌తో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయని.. రోహిత్‌రెడ్డి చెప్పిందే బీసీజీ రాసిచ్చిందని చంద్రబాబు ఆరోపించారు.
అమరావతి ప్రాంతమే రాజధానికి అనుకూలమని శివరామకృష్ణ కమిటీ చెప్పిందన్నారు చంద్రబాబు. తప్పుడు నివేదికలతో ప్రజలను మోసం చేయడం మానుకోవాలన్నారు. బీసీజీ, జీఎన్‌రావు కమిటీకి ఉన్న విశ్వసనీయత ఏంటని ప్రశ్నించిన చంద్రబాబు.. అమరావతిని ఫెయిల్యూలర్ సిటీలతో పోలుస్తారా అని మండిపడ్డారు.
విశాఖను మెగాసిటీగా తయారు చేశామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి ఇబ్బందులు సృష్టించింది వైసీపీనే అని ఆరోపించారు. గత ఐదేళ్లలో విశాఖను పలు రంగాల్లో అభివృద్ధి చేసి.. దేశంలోనే ది బెస్ట్ సిటీగా రూపొందించామని చెప్పారు.
అమరావతి రైతు మల్లిఖార్జున్‌రావు మృతిపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు గుండెపోటుతో చనిపోవడం బాధాకరమన్నారు. భూములు ఇచ్చిన 29 వేల మంది రైతులు మనోవేదనతో ఉన్నారన్నారు. ప్రభుత్వ చేతగాని తనం వల్ల ప్రజలు బలైపోతున్నారని విమర్శించారు చంద్రబాబు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com