బాగ్దాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఖాసింపై అమెరికా దళాల రాకెట్‌ దాడి

బాగ్దాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఖాసింపై అమెరికా దళాల రాకెట్‌ దాడి

us-attack

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్‌ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇరాన్ నిఘా విభాగం ఖడ్స్‌ ఫోర్స్‌ అధిపతి జనరల్‌ ఖాసిం సోలెమన్‌ సహా 8 మంది మృతి చెందారు. అయితే... ఈ దాడిని తామే చేసినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ ప్రకటించింది. ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి సోలెమన్‌ను చంపాలన్న.. అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాల మేరకు.. ఈ దాడి జరిపినట్టు పెంటగాన్ పేర్కొంది. జనరల్‌ సోలెమన్ మృతిని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కూడా ధృవీకరించారు. దాడి జరిగిన కొద్ది సేపటికే ట్విట్టర్‌లో అమెరికా జెండాను ట్వీట్ చేశారు ట్రంప్‌.

ఇరాక్‌లో ఉన్న తమ బలగాలను రక్షించుకునేందుకే ఖాసింను చంపాలని ట్రంప్ ఆదేశించినట్టు పెంటగాన్ తెలిపింది.భవిష్యత్తులో ఇరాన్ చేయాలనుకుంటున్న మరిన్ని దాడుల్ని నిరోధించడానికే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా పౌరుల్ని రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని పెంటాన్‌ పేర్కొంది. ఖాసిం సోలెమన్‌తోపాటు ఇరాక్ తిరుగుబాటు సంస్థ PMF డిప్యూటీ కమాండర్‌ అబు మహదీ అల్‌-మహందీస్‌ కూడా చనిపోయాడు.

2 రోజుల క్రితం ఇరాక్‌లోని అమెరికన్‌ ఎంబసీపై ఇరాన్‌ మద్దతున్న నిరసనకారులు.. ఇటీవలె దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడున్న అమెరికా బలగాలతో తీవ్రస్థాయిలో ఘర్షణపడ్డారు. దీనిపై సీరియస్‌ అయిన అమెరికా రివెంజ్ తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చింది. ఈ క్రమంలోనే... ఇరాన్‌ నిఘా చీఫ్‌ జనరల్ ఖాసిం సోలెమన్‌ను అంతమొందించింది. ఖాసింగ్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగగానే డైరెక్ట్‌గా రాకెట్‌ హిట్‌ చేసింది. ఆయన చేతివేలికున్న ఉంగరం ద్వారా అధికారులు గుర్తించారు.

ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌లో కీలక నిఘా విభాగమైన ఖడ్స్‌ ఫోర్స్‌కి.. మేజర్‌ జనరల్‌ ఖాసిం సోలెమన్‌.. 1989 నుంచి చీఫ్‌గా ఉంటున్నారు. ఇరాన్‌ సరిహద్దు వెలుపల జరిగే దాడుల్ని... ఖాసిం నేతృత్వం వహించేవారు. సిరియాలో బషర్‌ అల్ అసద్‌ ప్రభుత్వాన్ని కూల్చడం, ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్‌పై పోరులో ఖాసిం కీలక పాత్ర పోషించారని సమాచారం. ఇరాన్‌లో అధ్యక్షుడి కంటే.. పవర్‌ఫుల్‌ అయిన సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖుమేనికి ఖాసిం నేరుగా రిపోర్ట్‌ చేస్తారు. 1980లో జరిగిన ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధం తర్వాత... ఖాసిం వెలుగులోకి వచ్చారు. అమెరికాతో తలపడి.. బగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఖాసిం మృత్యువాతపడ్డారు.

తాజా ఘటనతో మధ్య ఆసియా ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశాలున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత మంది బలగాలను అమెరికా.. ఇరాక్‌కు పంపింది. ఈ ఎటాక్‌తో అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్‌లో నాలుగు శాతం ధరలు పెరిగాయి.

Tags

Read MoreRead Less
Next Story