24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్.. 4 లక్షల లైకులు.. విజయ్ స్టామినా మాములుగా లేదుగా..

24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్.. 4 లక్షల లైకులు.. విజయ్ స్టామినా మాములుగా లేదుగా..

vijay

విజయ్ దేవర్ కొండ యూత్ లో ఒక స్సెషల్ ఎట్రాక్షన్. రీసెంట్ గా రిలీజ్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ తో విజయ్ స్టామినా మరోసారి తెలిసింది. నాలుగు షేడ్స్ లో కనిపిస్తున్న విజయ్ మరోసారి తన మార్క్ యాక్టింగ్ తో మనసులు గెలుచుకున్నాడు. 24 గంటల్లో 6 మిలియన్స్ యూట్యూబ్ వీవర్స్ కౌంట్ ని సాధించగలిగింది. దీంతో పాటు 4 లక్షలకు పైగా ఆడియన్స్ తన ఇష్టాన్ని లైక్స్ రూపంలో తెలిపారు.

యూత్ లో తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకొని ఒకసినిమా బాలీవుడ్ లో రిలీజ్ అవ్వక పోయినా బాలీవుడ్ కబుర్లులో విజయ్ పేరు వినిపిస్తుందంటే అతనికి ఉండే క్రేజ్ సినిమాల సక్సెస్ తో మాత్రమే సొంతం అయ్యింది కాదు. అతని యాట్యిట్యూడ్, ఫ్యాషన్, ఇతరులతో మెలిగే తీరు ఇవన్నీ విజయ్ ని హీరోలలో ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే అతని క్రేజ్ పచ్చబొట్టులా మారిపోయింది.

సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ గా మారిన విజయ్ నటనలో రేంజ్‌ని ఈ సినిమాలో చూస్తారనే టాక్ వినిపిస్తుంది. ప్రిబ్రవరి 14న విడుదలు కాబోతున్న ఈ లవర్ విడుదలకు ముందే అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ప్రేమ లో ఒక దైవత్వం ఉంది అనే మాటతో సినిమా లోని సోల్ ని పరిచయం చేసాడు దర్శకుడు క్రాంతి మాధవ్.. విజయ్ కనిపిస్తున్న నాలుగు షేడ్స్ కూడా చాలా ప్రెష్ గా ఉన్నాయి. ఇప్పటికే విజయ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి

Read MoreRead Less
Next Story