విశాఖ జిల్లా నర్సీపట్నంలో దారి దోపిడీ ముఠా అరెస్ట్

విశాఖ జిల్లా నర్సీపట్నంలో దారి దోపిడీ ముఠా అరెస్ట్

2731e09dac988eab320d4d78598ae424

విశాఖ జిల్లా నర్సీపట్నంలో దారి దోపిడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. లంబసింగి పర్యాటకులను టార్గెట్‌గా చేసుకుని ఈ ముఠా దోపిడీకి పాల్పడుతున్నట్లు నర్సిపట్నం ఏఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. గత నెల 16న బలిఘట్టం వద్ద కారులో వెళ్తున్న పర్యాటకులను అడ్డగించి వారి వద్ద ఉన్న ఫోన్‌ పే ద్వారా 6వేల 500 బదిలీ చేయించుకున్నారు. అర్థరాత్రి వారిని రోడ్డుపై వదిలి కారులో పరారయ్యారు. కొంత దూరంలో కారును వదిలేసి దాంట్లో ఉన్న విలువైన వస్తువులను తీసుకుని పరారయ్యారు. మచిలీపట్నంకు చెందిన బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story