మిస్టరీగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రోహిత అదృశ్యం కేసు

మిస్టరీగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రోహిత అదృశ్యం కేసు

rohitha

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. 34 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రోహిత అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. కనిపంచకుండా పోయి దాదాపు 10 రోజులు అవుతున్నా..ఆచూకీ చిక్కటం లేదు. డిసెంబర్ 26న మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు విప్రో సర్కిల్ దగ్గర ఆటో ఎక్కింది రోహిత. ఆ తర్వాత ఏం జరిగింది? రోహిత ఎటు వెళ్లింది? జరగరాని అఘాయిత్యమేమైనా జరిగిందా? ఎక్కడో ఓ చోట సేఫ్ గా ఉందా?

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసు చోటు చేసుకున్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే రోహిత ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటన హీట్ చల్లారకముందే సైబరాబాద్ కమిషనరేట్ లోనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. రోహిత ఆపిల్ ఇండియాలో జాబ్ చేస్తోంది. నానక్ రామ్ గూడ్ లోని ఫ్లాట్లో ఉంటోంది. అదృశ్యమైన రోజున గచ్చిబౌలి విప్రో సర్కిల్ దగ్గర ఆటో ఎక్కవటం వరకు క్లారిటీ ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో చేదించాల్సి ఉంది.

అయితే..కుటుంబసభ్యులు ఆలస్యంగా ఫిర్యాదు చేయటం కూడా రోహిత మిస్సింగ్ కేసు మరింత కష్టంగా మారేలా చేసింది. డిసెంబర్ 26న ఆమె కనిపంచకుండాపోతే... డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశ ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాతే కావటంతో సైబరాబాద్ పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. రోహిత ఆచూకీని కనిపెట్టేందకు రెండు బృందాలను నియమించారు. సీసీ టీవీ ఫూటేజ్ పరిశీలిస్తున్నారు. ఆటోరీక్షా దిగి రోడ్డు క్రాస్ చేసే వరకు సీసీ టీవీ ఫూటేజ్ సంపాదించగలిగారు. ఆ తర్వాత సీసీ ఫూటేజ్ బ్లర్ ఉండటంతో టెక్కీ ఆచూకీ కనుక్కోవటం కష్టంగా మారిందని అంటున్నారు. అతి త్వరలోనే రోహిత ఆచూకీ కనుక్కుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story