చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముందుగానే మొదలైన సంక్రాంతి సందడి

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముందుగానే మొదలైన సంక్రాంతి సందడి

sankranthi

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సంక్రాంతి సందడి ముందుగానే మొదలైంది. గుడుపల్లి మండలంలో మైలేరు పండుగ జరుపుతున్నారు. కోడెద్దులను నిలువరించడానికి యువత పోటీ పడుతోంది. తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావడంతో పొరుగు రాష్ట్రం నుంచి ఈ పండుగ చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎద్దులను సైతం తీసుకొస్తున్నారు.

తమిళనాడులో జల్లికట్టుకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బహుమతులు గెలిచిన ఎద్దులకు మంచి గిరాకీ ఉంటుంది. అందుకే.. మైలేరు పండుగలో సైతం ఎడ్లు బహుమతులు గెలిస్తే.. వాటి రైతులు జాక్‌పాట్ తగిలినట్టుగా భావిస్తారు. అందుకే.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఎద్దులను తోలుకొస్తున్నారు.

చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో నెలరోజులుగా జల్లికట్టు నిర్వహిస్తున్నారు. అధికారులు ఎన్నిరకాలుగా అడ్డుకుంటున్నా.. ఇది సంప్రదాయం పేరుతో స్థానికులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈసారి నిర్వహకులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు.

Tags

Read MoreRead Less
Next Story