వైకుంఠ ఏకాదశికి ముస్తాబు

వైకుంఠ ఏకాదశికి ముస్తాబు

Vaikunta-Ekadasi

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని తిరుమల పుణ్యం క్షేత్రం ముస్తాబు అయింది. వైకుంఠ ద్వారా దర్శనం కోసం విశేష సంఖ్యలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. . గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంది.. ఏకాదశి, ద్వాదశి పర్వ దినాలలోనే శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారం తెరిచి ఉంటుంది. వైకుంఠ ద్వారం దర్శనం ద్వారా మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈనేపథ్యంలో సాధారణ రోజుల కన్న ఈ రెండు రోజులలో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. భక్తుల రద్దీని దృష్టిని దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి మూడు రోజుల పాటు అర్జిత సేవలు నిలిపివేశారు.

రేపు ఉదయం ధ‌నుర్మాస కైంక‌ర్యాల అనంత‌రం 2 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించనున్నారు.. ఉదయం 5 గంటల నుండి సర్వదర్శనం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.. విఐపిల‌తో పాటు సామాన్య భ‌క్తుల‌కు మ‌హాల‌ఘు ద‌ర్శనం ద్వారా శ్రీవారి దర్శనం చేయించనున్నారు.. భక్తులను తొలుత క్యూలైన్ల‌లోకి అనుమతించి ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, అటు త‌రువాత నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లుకు, అటు తరువాత మాడ వీధుల్లోని షెడ్లు, చివ‌ర‌గా క‌ల్యాణ‌వేదిక వద్ద భ‌క్తుల‌ను నింపుతామ‌న్నారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉదయం 9 గంటలకు శ్రీవారి స్వర్ణ రధం ఊరేగింపు.. ద్వాదశి పర్వదినం రోజు వేకువజామున 5 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం మహోత్సవ కార్యక్రమంను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి నేతృత్వంలో రెండు నెలల నుంచి ప్రణాళికలు రూపొందించి ఏకాదశి పర్వదినానికి సిద్ధం చేశారు. క్యూలైన్‌లలో భక్తులు ఎక్కువ సేపు నిల‌బ‌డ‌కుండా టిటిడి త‌గిన జాగ్రత్తలు తీసుకుంటోంది. భక్తులు చలికి తట్టుకునే విధంగా కోటి 70లక్షల రూపాయలతో జర్మన్ టెక్నాలజీ షేడ్లను ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story