మంటల్లో ట్రావెల్స్ బస్సు: తప్పిన పెనుప్రమాదం
By - TV5 Telugu |5 Jan 2020 4:26 AM GMT
శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో జరిగిన ప్రమాదంలో ఓ టూరిస్టు బస్సు మంటల్లో ఆహుతైంది. రోడ్డు దాటే సమయంలో ఓ ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు.. ఆ వేగంలో అదుపుతప్పింది. డివైడర్ దాటి మరీ అవతలివైపున ఆగిఉన్న లారీని ఢీ కొట్టింది. దీంతో.. బస్సుకు మంటలు అంటుకున్నాయి. తీవ్ర భయాందోళనకు గురైన టూరిస్ట్‌లు.. వెంటనే బస్ దిగేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన జరిగినప్పుడు అందులో 50 మంది ఉన్నారు. స్వల్పంగా గాయపడ్డ వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన బృందం పూరీ మీదుగా రామేశ్వరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com