భారత్‌కు చేరుకున్న పాక్‌ చెరలో ఉన్న 22 మంది ఏపీ మత్స్యకారులు

భారత్‌కు చేరుకున్న పాక్‌ చెరలో ఉన్న 22 మంది ఏపీ మత్స్యకారులు

పాకిస్థాన్ చెరలో ఉన్న 22 మంది తెలుగు మత్స్యకారులకు విముక్తి లభించింది. 13 నెలల తరువాత వారు భారత్‌లో అడుగుపెట్టారు. వాఘ బోర్డర్ దగ్గర జాలర్లను భారత్‌కు పాక్‌ అధికారులు అప్పగించారు. మత్స్యకారులకు ఏపీ మంత్రి మోపిదేవి రమణ స్వాగతం పలికారు. ఆయన్ను చూడగానే మత్స్యకారులంతా కన్నీటి భాష్పాలు కార్చరు. వారి ఆనంద భాష్పాలు చూసి మంత్రి కూడా చలించి పోయారు.

ఏడాది క్రితం గుజరాత్‌లోని వీరావలి ప్రాంతానికి వేటకోసం వెళ్లిన మత్స్యకారులు పాక్‌ కోస్టుగార్డులకు చిక్కారు. చేపలవేట సమయంలో దట్టమైన పొగమంచు కారణంగా వీరు ఉన్న బోటు పాక్ అంతర్భాగంలోకి వెళ్లడంతో అప్పటి నుంచి పాక్‌లోని జైళ్లలో మగ్గారు. వీరంతా నిన్నటి దాకా కరాచీ జైలులో ఉన్నారు. 13 నెలల పాటు మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురయ్యాయి. తమ ఆప్తులను విడిపించాలని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరగగా.. ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించాయి. మంగళవారం ఉదయం మత్స్యకారులు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఉదయం అమృత్ సర్ నుంచి విమాన మార్గంలో ఢిల్లీకి చేరుకుంటారు. సాయంత్రం ఢిల్లీ నుంచి విమాన మార్గంలో స్వస్థలాలకు మత్స్యకారులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story