ఆంధ్రప్రదేశ్

రాజధాని అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

రాజధాని అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
X

Screenshot_1

రాజధాని ఎక్కడ ఉండాలనేది.. ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏపీ రాజధాని విషయంలో ఇంకా స్పష్టత రాలేదని.. రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని కేంద్రం దృష్టికి తీసుకువస్తే మా వైఖరిని తెలియజేస్తామన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు కిషన్‌రెడ్డి. తిరుపతిలో జరిగిన సీఏఏ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు అమరావతిని నిర్లక్ష్యం చేశారని కేంద్రమంత్రి విమర్శించారు. భారత చిత్రపటంలో అమరావతికి చోటు కల్పించేలా తానే కృషి చేశానన్నారు కిషన్‌రెడ్డి.

Next Story

RELATED STORIES