ద్వారకా తిరుమలలో వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యత.. భక్తుల ఆగ్రహం

ద్వారకా తిరుమలలో వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యత.. భక్తుల ఆగ్రహం

dwaraka-tirumala

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో భక్తులు ఆందోళనకు దిగారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా ముందుకు కదలడం లేదని మండిపడ్డారు. ఈవో డౌన్‌డౌన్‌ అంటూ క్యూలైన్లలో నినాదాలు చేశారు. రాత్రి నుంచి నిలబడి ఉన్నా దర్శనం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదని వాపోయారు.

Tags

Next Story