మహారాష్ట్రలో మారిపోతున్న పొలిటికల్ ఈక్వేషన్స్.. మరోసారి మిత్రులుగా మారనున్న ప్రత్యర్థులు

మహారాష్ట్రలో మారిపోతున్న పొలిటికల్ ఈక్వేషన్స్.. మరోసారి మిత్రులుగా మారనున్న ప్రత్యర్థులు

maharastra

మహారాష్ట్రలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారిపోతున్నారు. ఉమ్మడి శత్రువును దెబ్బకొట్ట డానికి చేతులు కలుపుతున్నారు. బీజేపీ, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన మధ్య ఫ్రెండ్షిప్ చిగురిస్తోంది. రెండు పార్టీలు జట్టు కట్టినట్లు మహారాష్ట్రలో జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ కూటమికి వ్యతిరేకంగా బీజేపీ-MNS కూటమి ఏర్పాటు కాబో తుందని వార్తలు వెలువడుతున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని చెబుతున్నారు.

సంచలన రాజకీయాలకు వేదికగా నిలిచిన మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పాల్ఘర్‌లో ప్రధాని మోదీ, మాజీ సీఎం ఫడ్నవిస్, MNS అధినేత రాజ్‌ థాక్రేలతో కూడిన పోస్టర్లు వెలువడ్డాయి. స్థానిక బీజేపీ కార్యకర్తలు ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. మహా ప్రభుత్వంలో మంత్రులకు శాఖలు కేటాయించిన రోజునే ఈ పరిణామం జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంపై రాజ్ థాక్రే అసంతృప్తిగా ఉన్నారు. హిందూత్వవాదాన్ని అవహేళన చేసిన కాంగ్రెస్ పార్టీతో శివసేన జట్టుకట్టడాన్ని MNS తప్పుబడుతోంది. బీజేపీ కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు చేతులు కలపబోతున్నాయని ప్రచారం ఊపందుకుంది.

Tags

Read MoreRead Less
Next Story