కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. సోనియాగాంధీ చురుకుగా వ్యవహరించలేక పోతున్నందున రాహుల్‌కే మళ్లీ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. రాహుల్‌కు లైన్ క్లియర్ చేయడానికి సంస్థాగతంగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 12 రాష్ట్రాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను పునర్ వ్యవస్థీకరించనున్నట్లు సమాచా రం. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, బిహార్, అసోం, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త ఇన్‌ఛార్జ్‌ల నియా మకానికి సంబంధించి త్వరలో నిర్ణయం ప్రకటించే అవకాశముంది. మార్పు లు చేర్పులకు సంబంధించిన ప్రతిపాదనలు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ముందున్నాయి.
ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాల్లో రాహుల్ ప్రమేయం పెరుగుతూ వస్తోంది. రామ్‌లీలా మైదాన్‌లో భారత్ బచావో ర్యాలీకి రాహు లే నేతృత్వం వహించారు. సీఏఏకి వ్యతిరేకంగా రాజ్‌ఘాట్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మీరట్‌లో సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో మృతుల కుటుంబాలను రాహుల్ పరామర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలోపార్టీ పగ్గాలు మళ్లీ రాహుల్ గాంధీ చేపట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. పీసీసీల మార్పులు, చేర్పుల తుది కసరత్తులో రాహుల్ పాల్గొనే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మారనుంది. ట్రబుల్ షూటర్, సీనియర్ నాయకుడు డీకే శివకుమార్‌కు కేపీసీసీ బాధ్యతలు అప్పగించనున్నారని సమాచారం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ దినేష్ గుండూ రావు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలో డీకేను నియమించే అవకాశముందని అంటున్నారు. కర్ణాటక జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ స్థానంలో కొత్తవారికి ఛాన్స్ లభించవచ్చు. ఇక, బీహార్‌లోనూ 2021 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేసే అవకాశాలున్నాయి. ఆ రాష్ట్రంలో జిల్లా, బ్లాక్ స్థాయిలో కొత్త కమిటీలను ఏర్పాటు చేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com