మరోసారి ఉద్రిక్తంగా మారిన జేఎన్‌యూ.. ముసుగులు ధరించి విద్యార్ధులు, ప్రొఫెసర్లపై దాడి

ఢిల్లీ జేఎన్‌యూ మరోసారి ఉద్రిక్తంగా మారింది. రాత్రి కొంతమంది ముసుగులు ధరించి, రాళ్లు, రాడ్లతో క్యాంపస్‌లోని హాస్టళ్లలోకి చొరబడి విద్యార్ధులు, ప్రొఫెసర్లపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో విద్యార్ధి నేత అయిషీ ఘోష్‌తో పాటు 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరు ప్రొఫెసర్లకు కూడా గాయపడ్డారు. ముసుగు ధరించిన 50 మంది దుండగులు క్యాంపస్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో జేఎన్‌యూలో భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ గేటు దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. గాయపడిన వారులో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. తమపై దాడికి తెగబడిన గూండాలు ఇప్పటికీ క్యాంపస్ హాస్టల్స్‌లోనే ఉన్నారని విద్యార్ధులు ఆరోపించారు. క్యాంపస్‌లో దుండగులు భయోత్పాతం సృష్టించినా పోలీసులు, సెక్యూరిటీ గార్డులు చోద్యం చూశారని పలువురు మండిపడుతున్నారు. ఏబీవీపీ విద్యార్థులే ముసుగులు వేసుకుని తమపై దాడి చేశారని స్టూడెంట్యూనియన్వర్గం, వామపక్ష విద్యార్థి సంఘం వాళ్లే తమపై దాడి చేశారని ఏబీవీపీ వర్గం పరస్పర ఆరోపణలకు దిగాయి.
జేఎన్‌యూలో దాడి ఘటనను లెఫ్టినెంట్‌గవర్నర్ అనిల్ బైజల్, సీఎం కేజ్రీవాల్ ఖండించారు. జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్అధికారులతో కలిసి క్యాంపస్‌లో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు బైజల్ట్వీట్చేశారు. వర్సిటీ క్యాంపస్‌లోనే స్టూడెంట్లకు సెక్యూరిటీ లేకుంటే, దేశం ఎలా ముందుకెళ్తుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరా తీశారు. ఎయిమ్స్‌కు వెళ్లిన ప్రియాంక గాంధీ క్షతగాత్రుల్ని పరామర్శించారు. దాడి ఘటనను వివిధ వర్సిటీల విద్యార్ధులు తీవ్రంగా ఖండించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com