నేడు విష్ణుమూర్తిని దేవతలు దర్శించుకునే రోజు

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగురాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వార దర్శనానికి బారులు తీరారు. శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన సుదినం వైకుంఠ ఏకాదశి. దేవతలకు బ్రహ్మ మూహూర్త కాలం వైకుంఠ ఏకాదశి. వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దేవతలు దర్శించుకునే రోజు ఇది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు
వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం అత్యంత ప్రముఖమైనది. ఉత్తర ద్వారం నుంచి వేంకటేశ్వరున్ని దర్శించుకుంటే పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముక్కోటి దేవతలను పూజించి న అదృష్టం వస్తుందని నమ్మకం. అందుకే శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఆలయాల్లో పటిష్ట చర్యలు తీసుకున్నారు. స్వామివారి దర్శనం, ప్రసాద వితరణకు ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com