అమెరికా స్థావరాలు, బలగాలు లక్ష్యంగా అటాక్‌లు

అమెరికా స్థావరాలు, బలగాలు లక్ష్యంగా అటాక్‌లు

అమెరికాకు చావే గతి..అగ్రరాజ్య దురహంకారానికి దారుణమైన దెబ్బ తప్పదు.. సాతాను దేశాన్ని సర్వనాశనం చేస్తాం.. దాడులతో యూఎస్‌ గుండెల్లో వణుకు పుట్టిస్తాం... ప్రస్తుతం ఇరాన్‌లో మార్మోగుతున్న నినాదాలు ఇవే.

ఖాసిం సులైమానీ మృతితో యావత్ షియా సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది. షియా కుటుంబాలన్నీ కన్నీటివేదనలో మునిగిపోయాయి. నాయకున్ని కోల్పోయామనే బాధ ఇరాన్ ప్రజలను కలచి వేస్తోంది. సైనికాధికారులు కూడా కన్నీటిని ఆపుకోలే కపోయారు. ఇరాన్ అంతటా సులైమానీ వార్తలే. దేశం మొత్తం ఆయన చిత్రపటాలే. ఎక్కడ చూసినా సులైమానీకి నివాళులు అర్పిస్తున్న దృశ్యాలే.

సులైమానీ అంతిమ యాత్రకు జనం పోటెత్తారు. అచ్చంగా జనసంద్రం అక్కడ ఆవిష్కృతమైంది. లక్షలాదిమంది షియాలు, సులైమానీ అంతిమయాత్రలో పాల్గొన్నారు. సులైమానీ అంతిమయాత్ర ఉద్వేగభరితంగా సాగింది. అందరి కళ్లల్లోనూ అంతులేని విషాదం.. ఆ విషాదం మాటునే ప్రతీకార జ్వాలలు.

మా నాన్న మరణానికి ప్రతీకారం ఎవరు తీర్చుకుంటారు... ఖాసిం సులైమానీ కుమార్తె ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌనీని అడిగిన ప్రశ్న ఇది. ఇదేదో అల్లాటప్ప ప్రశ్న కాదు. ఆ.. ఏదో చేస్తాంలే అని చెప్పి తప్పించుకునే అవకాశమూ లేదు.. అందుకే హసన్ రౌనీ కూడా ఏదో సమాధానం చెప్పి తప్పించుకోలేదు. ఏం చేయబోతున్నామో ఓ సంకేతం ద్వారా చెప్పారు. అత్యంత పవిత్రమైన జంకారన్ మసీ దుపై ఎర్రజెండాను ఎగురవేయడం ద్వారా ప్రతీకారం తప్పదని సిగ్నల్ ఇచ్చేశారు.

Tags

Read MoreRead Less
Next Story