ముగిసిన హై పవర్‌ కమిటీ భేటీ

ముగిసిన హై పవర్‌ కమిటీ భేటీ

ap-issue

రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన హై పవర్‌ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కమిటీ మెంబర్‌ కన్వీనర్‌ నీలం సాహ్ని నేతృత్వంలో ఆర్టీసీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ సమావేశం జరిగింది. అధికార వికేంద్రీకరణతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని హై పవర్‌ కమిటీ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. జీఎన్‌ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ నివేదికపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది.

Tags

Next Story