ఆంధ్రప్రదేశ్

వైసీపీ నిరంకుశ పాలనకు అది పరాకాష్ట : చంద్రబాబు

వైసీపీ నిరంకుశ పాలనకు అది పరాకాష్ట : చంద్రబాబు
X

babu

టీడీపీ నేతలను పోలీసులు నిర్బంధించడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. రాజధాని కోసం వేలాది కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నాయన్న చంద్రబాబు. రైతులు, రైతు కూలీలకు మద్దతు తెలిపేందుకు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు.. వందలాది మంది టీడీపీ నేతల అక్రమ నిర్బంధం వైసీపీ నిరంకుశ పాలనకు పరాకాష్ట అన్నారు. రైతులు, మహిళలు, రైతు కూలీలపై అక్రమ కేసులు పెట్టడం గర్హనీయమన్నారు. పోలీసు బలగాలతో ప్రజాభీష్టాన్ని కాలరాయలేరన్నారు చంద్రబాబు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Next Story

RELATED STORIES