అయ్యో రామ.. బట్టతలతో బతకలేనంటూ ఓ యువకుడు..

అయ్యో రామ.. బట్టతలతో బతకలేనంటూ ఓ యువకుడు..

suicide

జుట్టు ఊడిపోతోంది.. ఏం చేద్దాం.. అందరిదీ అదే సమస్య. దాన్ని కొందరు లైట్‌గా తీసుకుంటే మరికొందరు సీరియస్‌గా తీసుకుంటున్నారు. డాక్టర్ల దగ్గరకు పరిగెట్టడం మందులెన్నో వాడడం. తీసుకునే ఆహారం, పొల్యూషన్, వేళకు నిద్ర ఇవన్నీ జుట్టు ఊడిపోవడానికి కారణాలవుతాయంటూ డాక్టర్లు వివరిస్తుంటారు. అయినా అదే ఆలోచన అతడిని నిద్ర పట్టనివ్వకుండా చేసింది. చివరకు దాన్ని ఓ పెద్ద సమస్యగా భావించి ప్రాణాలు తీసుకున్నాడు.

బంగారంలాంటి భవిష్యత్‌కి ముగింపు పలికాడు. హైదరాబాద్ కొండాపూర్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఎంబీఏ చదువుతుండగా, చిన్న కొడుకు ఇంటి దగ్గరే ఉంటూ జేఈఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. సైనస్ సమస్య అతడిని వేధిస్తోంది. దానికి తోడు ఆరు నెలల నుంచి జుట్టు ఊడిపోతోంది. అదో మనేది. దాంతో చదువపై కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు.

అమ్మా నాన్నలతో తరచూ ఇదే విషయం గురించి మాట్లాడుతుండేవాడు. సోమవారం ఉదయం స్నానానికని బాత్‌రూంలోకి వెళ్లాడు. ఎంతకూ బయటకు రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చి భర్తకు ఫోన్ చేసింది. అతడు వచ్చి బాత్రూం తలుపులు పగులగొట్టి చూడగా కొడుకు ఊరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Next Story