ఇండియన్ నేవీలో ఇంటిదొంగల గుట్టు రట్టు
ఇండియన్ నేవీలో ఇంటిదొంగల గుట్టు రట్టవుతోంది. భారత నావికాదళంలో హనీట్రాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మరో ముగ్గురు సైలర్లను అరెస్టు చేశారు. దీంతో.. ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరింది. తాజాగా రాజేష్, లోకనంద, నిరంజన్ అరెస్టయ్యారు. వాళ్లు ముగ్గురు 2015లో నేవీలో చేరారు. ఈ స్వల్ప కాలంలోనే శత్రు దేశాల గాలానికి దొరికారు. దేశ రహస్యాలను చేరవేస్తూ దొరికిపోయారు. హనీట్రాప్ వ్యవహారంపై NIA విచారణ కొనసాగిస్తోంది.
హనీట్రాప్ వ్యవహారం భారత నావికాదళాన్ని కుదిపేస్తోంది. పాకిస్తాన్‌కు సమాచారం చేరవేస్తున్న ఏడుగురు సిబ్బందిని గతంలో ఇంటెలిజన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. FIR నమోదు చేసి విజయవాడ కోర్టుకు తరలించారు. పాకిస్తాన్‌లో ఎవరికి సమాచారం చేరవేస్తున్నారు? ఈ అడ్డగోలు పని ఎన్నాళ్లుగా చేస్తున్నారనే వివరాలపై లోతైన విచారణ జరుగుతోంది. మరికొందరు సూత్రధారులు, పాత్ర ధారుల కోసం NIA వేట సాగుతోంది. అందులో భాగంగా మరో ముగ్గురు దుర్మార్గులను పట్టుకున్నారు.
భారత నావికాదళంలో దేశద్రోహులు ఉన్నట్టు కొన్నాళ్ల క్రితం అధికారులకు ఉప్పందింది. వాళ్లపై నిఘా ఉంచారు. గుట్టు రట్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజన్స్ విభాగం సైతం ఈ స్పెషల్ ఆపరేషన్‌లో పాల్గొంది. కేంద్ర నిఘా సంస్థలు ఫోకస్ పెట్టాయి. నావికాదళ నిఘా అధికారులు సైతం సహకరించారు. అలా.. పాకిస్తాన్‌కు కీలక సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఇప్పటివరకు 10 మంది నౌకాదళ సిబ్బందిని అరెస్టు చేశారు. హవాలా ఆపరేటర్‌ను కూడా అరెస్టు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విచారణ సాగుతోంది. మరికొన్ని అరెస్టులు ఉంటాయని భావిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com