నిర్భయ కేసులో తాజా పరిణామాలు ఇవే!

నిర్భయ కేసులో తాజా పరిణామాలు ఇవే!

nirbaya-case

తాళ్లు సిద్ధంగా ఉన్నాయ్.. పోల్స్ రెడీ అయ్యాయ్.. డెడ్‌బాడీలను తీసుకెళ్లే వాహనాలు వచ్చేశాయ్.. మరో రెండు వారాల్లో శిక్ష అమలు చేయడమే మిగిలింది. నిర్భయ కేసులో తాజా పరిణామాలివి. నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష పడనుంది. ఇందుకోసం తీహార్ జైలులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తీహార్ జైలులో ఒకటే ఉరికంబం ఉండగా నలుగురిని ఒకేసారి ఉరితీయడం కోసం మరో మూడు ఉరికంబాలను రెడీ చేశారు. ఉరి తర్వాత మృతదేహాలను తరలించడానికి సొరంగాలను కూడా నిర్మిం చారు. ఉరి సమయంలో జేసీబీ అవసరం ఉంటుందనే ఆలోచనతో జేసీబీని కూడా తీహార్ జైలుకు తీసుకొచ్చారు.

ఒకే ఉరికొయ్యకు.. నలుగురి మెడలకు వేర్వేరు తాళ్లతో కట్టి.. ఒకేసారి బిగుసుకునేలా ఉరిశిక్ష అమలుచేయాలని నిర్ణయించారు. నలుగురు దోషులను ఏకకాలంలో ఉరి తీయడం దేశ చరిత్రలో మొదటి సారిగా చెప్తున్నారు. ఎందుకంటే.. విడివిడిగా ఉరి తీస్తే... సదరు వ్యక్తి చనిపోయాడో, లేదో తెలుసుకునేందుకు అరగంట సమయం వేచి చూడాల్సి ఉంటుంది. మిగతా దోషుల వంతు వచ్చేసరికి.. అది వాళ్లకు భయంకరమైన అనుభవం అవుతుంది. జైలులో ఇన్నాళ్ల జీవితం ఒక ఎత్తు.. ఉరితాడు రూపంలో మరణ దేవత ఆహ్వానిస్తున్న సమయంలో వాళ్ల ప్రవర్తన మరో ఎత్తు. ఒకవేళ నలుగురిలో ఎవ రైనా స్పృహ తప్పి పడిపోయినా, అనారోగ్యానికి గురైనా, ఉరిశిక్ష నిలిపివేయాల్సి ఉంటుంది. అందుకే అలాంటి అవకాశం ఇవ్వకూడదనే తీహార్ జైలు అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

ఉరిశిక్ష అమలు చేసే కంట్రీయార్డ్‌ ప్రాంతాన్ని తీహార్ జైలు అధికారులు పరిశీలించారు. నలుగురిని ఒకేసారి ఉరి తీస్తే.. వాళ్ల బరువును ఉరికంబం ఆపుతుందో లేదో చెక్ చేశారు. 1950లో నిర్మించిన రెండు కాంక్రీట్ పిల్లర్లకు మెటల్ క్రాస్‌ బార్‌ ఏర్పాటు చేసి ఉంది. అదేమైనా తుప్పుపట్టిందా, విరిగే అవకాశం ఉందా అని తనిఖీ చేశారు. ఉరిస్తంభాన్ని శుభ్రం చేయించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. తమిళ నాడు నుంచి ప్రత్యేక పోలీసు దళాన్ని రప్పించారు.

Tags

Read MoreRead Less
Next Story