ఉల్లిపాయల కోసం ఊరంతా రోడ్డు మీద.. ఫ్రీగా వచ్చాయి మరి..

ఉల్లిపాయల కోసం ఊరంతా రోడ్డు మీద.. ఫ్రీగా వచ్చాయి మరి..

onions

డబ్బులు ఊరికే రావు లాగ ఉల్లిపాయలు కూడా ఊరికే రావు. కేజీ ఉల్లిపాయలు కొంటున్నారంటే వాళ్లెంత ధనవంతులో కదండీ అని పక్కింటి పిన్ని గారి గురించి మాట్లాడుకుంటున్న ప్రస్తుత రోజుల్లో రోడ్డు మీద ఉల్లి పాయలు కనిపించాయంటే ఎంత అదృష్టం. డబ్బు, నగలను కూడా వదిలేసి ఉల్లిపాయలను తస్కరిస్తున్నారు చోర మహాశయులు. రేట్లు అలా మండి పోతున్నాయి ఏం చేయమంటారు అని చెప్పేవారు ఎక్కువగానే ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో రోడ్డు మీద ఉల్లి పాయలు కనిపిస్తే ఎలా ఊరుకుంటారు.

ఒడిశా సంబల్పూర్ జిల్లాలోని బెల్పహార్‌ నేషనల్ హైవేపై ఉల్లిపాయల లోడ్‌తో వెళుతున్న లారీ ఎక్కువ వేగంగా వెళ్లడంతో అందులో నుంచి కొన్ని ఉల్లి బస్తాలు కింద పడ్డాయి. దీంతో రోడ్డు మీద వెళ్లే వారు ఎక్కడి వారు అక్కడ ఆగిపోయి దొరికిన ఉల్లిపాయలు దొరికినట్లు సంచుల్లో వేసుకున్నారు. కారులో వెళుతున్నవారు కూడా ఆగి మరీ కారు డిక్కీల్లో వేసుకున్నారు. జనం అంతా ఉల్లిపాయలు ఏరే పనిలో పడడంతో హైవేపై కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది.

Read MoreRead Less
Next Story