'ఆమె'కు ఆసరా ఎస్‌బీఐ 'ముద్ర'.. రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు లోన్..

ఆమెకు ఆసరా ఎస్‌బీఐ ముద్ర.. రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు లోన్..

mudra-loan

స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు వివిధ రకాల సేవలు అందిస్తోంది. అందులో ముద్రా లోన్ కూడా ఒకటి. ప్రధాని నరేంద్ర మోదీ 2015 ఏప్రిల్ 8న చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ముద్రా యోజన (పీఎంఎంవై) స్కీమ్ ఆవిష్కరించారు. ఈ పథకం కింద రూ.10 లక్షల వరకు లోన్ ఇస్తారు. ముద్రా లోన్స్‌లో మూడు రకాలు ఉంటాయి. అవి శిశు, కిషోర్, తరుణ్ అనే మూడు విభాగాలు ఉంటాయి.

రూ.50,000 లోపు రుణం తీసుకుంటే వారు 'శిశు' విభాగం కిందకు వస్తారు. రూ.50 వేల నుంచి రూ.5 లక్షల లోపు రుణం తీసుకుంటే కిశోర్ విభాగం కిందకు, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు రుణం తీసుకుంటే తరుణ్ విభాగం కిందకు వస్తారు. తీసుకున్న రుణాన్నే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం ప్రారంభించొచ్చు. ఇప్పటికే బిజినెస్ చేస్తూ ఉంటే దాన్ని మరింత విస్తరించుకోవచ్చు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు బిజినెస్‌లకు కూడా లోన్ తీసుకోవచ్చు.

తీసుకున్న రుణాన్ని 3 నుంచి ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రుణం తీసుకున్న తరువాత 6 నెలల వరకు ఎటువంటి ఈఎంఐలు చెల్లించాల్సిన పనిలేదు. ముద్రా స్కీమ్ కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. బ్యాంక్‌లో ముద్రా స్కీమ్ కింద లోన్ తీసుకున్న వారికి ముద్రా రూపే కార్డు లభిస్తుంది. ఇది డెబిట్ కార్డు. ముద్రా లోన్ అకౌంట్‌తో ఇది లింక్ అయ్యి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఏ ఏటీఎం నుంచైనా డబ్బు తీసుకోవచ్చు.

Read MoreRead Less
Next Story