నిర్ణయం తీసుకున్నాం వస్తారా? చస్తారా? అన్నట్టు ఉంటే ఎలా- ఉద్యోగులు

నిర్ణయం తీసుకున్నాం వస్తారా? చస్తారా? అన్నట్టు ఉంటే ఎలా- ఉద్యోగులు

ap-capital-issue

రాజధాని తరలింపు ఆ ప్రాంత ప్రజల్లోనే కాదు.. సచివాలయ ఉద్యోగుల్లోనూ తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.. అమరావతి తరలిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో ఉద్యోగుల్లో తిరుగుబాటు మొదలైంది.. సచివాలయంలో సమావేశమైన ఉద్యోగులు తాజా పరిణామాలపై చర్చించారు.. ప్రభుత్వానికి తామంటే లెక్క లేకుండా పోయిందని సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సచివాలయ తరలింపులో ప్రభుత్వం తమ అభిప్రాయాలు తీసుకోకపోవడంపై వారు మండిపడుతున్నారు.. హైదరాబాద్‌ నుంచి హడావిడిగా అమరావతి తీసుకొచ్చారని.. ఇప్పుడు మళ్లీ విశాఖ అంటున్నారని ఫైరవుతున్నారు. రాజకీయాలు ఉంటే వారే చూసుకోవాలని.. ఉద్యోగులను ఇబ్బంది పెట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

అమరావతి రాజధానిగా కొనసాగుతుందనే నిర్ణయంతో చాలా మంది ఉద్యోగులు విజయవాడలో ఇళ్లు, స్థలాలు కొన్నారని అన్నారు.. కొందరు ఇప్పటికీ ఈఎంఐలు కట్టుకుంటున్నారని చెప్పారు.. తమ ఇబ్బందులను ప్రభుత్వం ఆలోచించాలని వారంటున్నారు.. అమరావతిలో తమకు సౌకర్యంగానే ఉందని చెబుతున్నారు.. తమను ఇబ్బంది పెట్టొద్దంటున్నారు.. నిర్ణయం తసీఉకున్నాం వస్తారా చస్తారా అన్నట్టు ఉంటే ఎలా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.. అకస్మాత్తుగా విశాఖ వెళ్లాలి అంటే తమ పరిస్థితి ఏంటని సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ సచివాలయం తరలింపుపై పునరాలోచించుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story