రాములో రాములా.. సుధీరో సుధీరా.. సూపర్‌గ ఏశావురో..

గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఒకటే ఫీవర్.. యూత్ అంతా ఆ పాటలకు బాగా కనెక్ట్ అయిపోయారు.. సామజవరగమనా ఒకటైతే రెండు మంచి ఊపు నిచ్చే పాట రాములో రాములా.. త్రివిక్రమ్ సినిమా.. అల వైకుంఠపురం సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. రాములో పాటకు బన్నీ అంత కాకపోయినా ఓ స్టెప్ వేయాలన్నంత ఊపు వచ్చేస్తుంది ప్రతి ఒక్కరిలో.
నాక్కూడా అంతేనండోయ్ అంటున్నాడు సుడిగాలి సుధీర్.. యాంకర్ విష్ణుప్రియతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసి బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు సుధీర్. పోవే పోరా కామెడీషోకి వర్క్ చేస్తున్న సుధీర్.. షోలో భాగంగా రాములో రాములా పాటకు డ్యాన్స్ ఇరగదీశాడు. విష్ణుప్రియ కూడా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేసింది. సకల కళా వల్లభుడు సుడిగాలి సుధీర్.. ఓ పక్క యాంకరింగ్, కామెడీ, స్కిట్లు, మిమిక్రీ, డ్యాన్స్ ఒకటేమిటి అన్నిట్లో నెంబర్ వన్‌గా నిలుస్తూ సాప్ట్‌వేర్ సుధీర్‌నంటూ వెండి తెరపై కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకున్నాడు. ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com