సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట.. 50 మందికి పైగా మృతి

సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట.. 50 మందికి పైగా మృతి

IRAN

ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తత అంతకంతకు పెరుగుతోంది. ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులేమానీ హత్య చేసిందంటూ ఆమెరికాపై ఆగ్రహంతో రగిలిపోతున్నఇరాన్ ఆమెరికాకు సంబంధించి ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ట్రంప్ తలతెచ్చిన వారికి భారీ నజరానాలు ప్రకటనలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అనుఒప్పందాన్ని తాము ఇక పాటించబోమంటూ తేల్చేసింది. ఇక ప్రతికార చర్యల్లో కొనసాగింపుగా ఇరాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సులేమానీని చంపినందుకుగానూ అమెరికా ఆర్మీని..పెంటగాన్ సిబ్బందిని ఉగ్రవాదులుగా తీర్మానిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఆమెరికా దాడి ముమ్మాటికి ఉగ్రవాద చర్యేనని ఆరోపించింది. అంతేకాదు..ఆమెరికాపై ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇరాన్..అలాగే సులేమానీ నేతృత్వం వహించిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్పస్ 200మిలియన్ యూరోల ప్రత్యేక నిధుల్ని కేటాయిస్తూ పార్లమెంట్ సభ్యులు ఆమోదం తెలిపారు.

మరోవైపు అమెరికా దాడుల్లో మృతిచెందిన ఖాసీం సులేమానీ అంత్యక్రియలు ఆతని స్వస్థలమైన కెర్మాన్ నిన్న జరిగాయి. అయితే.. సులేమాని అంతిమయాత్రకు లక్షలాది మంది తరలిరావటంతో తొక్కిసలాట జరిగి పెను విషాదం మిగిల్చింది. దీంతో 50 మందికి పైగా మృతిచెందారు. 200 మంది వరకు గాయపడ్డారు.

ఇరాన్- ఆమెరికా మధ్య రెచ్చగొట్టే చర్యలతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలతపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త ఏడాది కలతలతో ప్రారంభమైందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మనం ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నామని ఈ సంక్షోభం మరింత పెరుగుతుందని హెచ్చరించారు. యుద్ధంతో ప్రజలు ఎదుర్కునే సమస్యలను మరిచిపోకుండా సామరస్యతకు అందరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story