మీ పంతాల కోసం ఇంకెంత కాలం ఏమారుస్తారు?

మీ పంతాల కోసం ఇంకెంత కాలం ఏమారుస్తారు?

capital-issue

బతుకునిచ్చిన భూముల్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసిన రైతులు గుండెమంటతో రగిలిపోతున్నారు. తమ త్యాగ ఫలితం ఎక్కడని నిలదీస్తున్నారు. కళ్ల ముందు మెదిలిన రాజధాని వైభవాన్ని నిలువునా కూల్చేసిన పాలకులపై నినదిస్తున్నారు. ఓటుతో ఆశీర్వదిస్తే మొండిపోకడలతో పోటు పొడుస్తావా అంటూ ప్రశ్నిస్తున్నాయి రాజధాని ప్రాంత గొంతుకలు. ఇంకా ఎన్ని రాజధానులు మారుస్తారు? మీ పంతాల కోసం ఇంకెంత కాలం ఏమారుస్తారు? అంటూ భవిష్యత్ కోసం రణనినాదం అందుకున్నారు. రా చూస్కుందాం అంటూ నాగలి పట్టిన రైతులు పిడికిలి బిగించిన యోధులై ప్రభుత్వంతో కలబడేందుకు సిద్ధమయ్యారు. జన్మభూమిలో రాజధాని కలను నెరవేర్చుకునేందుకు పోరాడితే పోయేదేముంది అంటూ కదం తొక్కుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story