ఆంధ్రప్రదేశ్

బ్రేకింగ్.. రాజధాని తరలింపుతో ఆగిన మరో రైతన్న గుండె

బ్రేకింగ్.. రాజధాని తరలింపుతో ఆగిన మరో రైతన్న గుండె
X

amaravati-farmer

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. ఐనవోలులో పాలకాయల మాధవ గుండెపోటుతో మృతి చెందాడు. ప్రభుత్వం.. రాజధానికి భూములు అడిగినప్పుడు అర ఎకరం పొలాన్ని మాధవ ఇచ్చేశాడు. ఇప్పుడు రాజధాని తరలించాలని వైసీపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించడంతో.. మూడు వారాలుగా ఆయన ఉద్యమంలో పాల్గొంటున్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేశారు. హైపవర్ కమిటీ సమావేశంలోను పాత పాటే పాడడంతో.. ఆయన గుండె అలసిపోయింది. తీవ్ర మనోవేదనతో మంచం పట్టి చనిపోయారని మాధవ కుటుంబసభ్యులు చెబుతున్నారు.

Next Story

RELATED STORIES