అమరావతిలో మరో రైతు గుండె ఆగిపోయింది..

అమరావతిలో మరో రైతు గుండె ఆగిపోయింది..

farmers

రాజధాని తరలిపోతుందన్న ఆవేదన రైతుల ఉసురు తీస్తోంది.. అమరావతిలో మరో రైతు గుండె ఆగిపోయింది.. కృష్ణాయపాలెంలో అద్దేపల్లి కృపానందం అనే రైతు గుండెపోటుతో కన్నుమూశాడు.. రాజధాని కోసం కృపానందం తనకున్న అర ఎకరం పొలాన్ని ఇచ్చాడు.. రాజధాని తరలిపోతే తమ కుటుంబం రోడ్డున పడుతుందని తీవ్ర ఆవేదనలో పడిపోయాడు. మూడు రోజులుగా కృపానందం కుటుంబం రాజధాని ఆందోళనల్లో పాల్గొంటోంది. రాత్రనక, పగలనక పోరాటాలు చేస్తున్నా.. తాజా పరిణామాలతో మరింత మదనపడ్డాడు. ఇవాళ తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటు రావడంతో మంగళగిరిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయినట్టు బంధువులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story