వికేంద్రీకరణ దిశగానే.. హైపవర్ కమిటీ అడుగులు
జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నిమయించిన ఈ హైపవర్ కమిటీ.. నిన్న తొలిసారిగా విజయవాడలో సమావేశం అయ్యింది. దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో అభివృద్ధి వికేంద్రీకరణ, పారిపాలన వికేంద్రీరణ అవశ్యతపై సుదీర్ఘంగా చర్చించింది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఎగ్జిక్యూటీవ్ రాజధాని ఎక్కడ ఉండాలి, అనుకూలించే పరిస్థితులు ఏమిటీ అనేది చర్చించారు.
అలాగే జీఎన్ రావు కమిటీ, బీసీజీ కమిటీల ప్రతినిధులు కూడా తమ నివేదికలోని ప్రాధాన అంశాలపై హైపవర్ కమిటీకి వివరించింది. గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చును భరించే స్థోమత ఏపీకి లేదని వివరించింది. ఓవరాల్ గా అధికార వికేంద్రీకరణతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని హై పవర్ కమిటీ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించింది. అలాగే అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పరిపాలనా వికేంద్రీకరణ అవసరమని ప్రాధమికంగా అభిప్రాయానికి వచ్చింది.
జోనల్, సెక్టార్ వైజ్ గా ఏ విధంగా అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ అంశాలపై మీటింగ్ లో ఫోకస్ చేసినట్లు కమిటీ తెలిపింది. అయితే పరిపాలన వికేంద్రీకరణపై అందరితో మాట్లాడిన తర్వాతే తగిన నిర్ణయానికి వస్తామని కూడా కమిటీ చెబుతోంది. రైతులు అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకంటామని అంటోంది. గత ప్రభుత్వం ఏకపక్షం నిర్ణయం తీసుకుందిని విమర్శించిన కమిటీ సభ్యులు..తాము అందరితో చర్చిస్తామని అంటున్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఒక్కో జిల్లాలకు రెండు ప్రాజెక్టులతో పాటు అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలనే అంశంపైనా కమిటీ చర్చించింది. మొత్తంగా ప్రభుత్వ ఆశించినట్లుగానే నివేదిక ఇచ్చిన జీఎన్ రావు, బోసీజీ కమిటీ నివేదికల్లాగే హైపవర్ కమిటీ కూడా పరిపాలన వికేంద్రీకరణ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com