ఇరాన్‌లో భూకంపం.. అమెరికా మళ్లీ దాడి చేసిందా అనే అనుమానం!

ఇరాన్‌లో భూకంపం.. అమెరికా మళ్లీ దాడి చేసిందా అనే అనుమానం!

Iran-earthquake

ఇరాన్‌లో భూకంపం సంభవించింది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైంది. ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసా రిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మళ్లీ దాడి చేసిందా అనే అనుమానాలతో వణికిపోయారు. టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్ విమానం కూలిపోయిన సమయంలోనే భూకంపం రావడంతో ఏం జరుగుతుందో అర్ధంగాక భయాందోళనలకు గురయ్యారు.

ఇరాన్‌లో బుషెహ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. ఇది బామ్ నగరానికి సమీపంలో ఉంటుంది. బలమైన భూకంపాలను కూడా తట్టుకునేలా ఈ పవర్ ప్లాంట్‌ను నిర్మించారు. 2006లో బామ్‌ నగరంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ సమయంలో 26 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బామ్‌ నగరం బుషెహ్‌ ప్లాంట్‌కు దగ్గరగా ఉన్నప్పటికీ ఆ పవర్ ప్లాంట్‌కు ఏమీ కాలేదు. ఇక, ఇరాన్ అణ్వా యుధాలకు సంబంధించిన పరీక్షలు, అణు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడే జరుగుతాయి. గత ఏడాది డిసెంబర్ 27న కూడా ఇక్కడ భూకంపం వచ్చింది. అప్పుడు భూకంప తీవ్రత రిక్టర్ స్కే లుపై 5.1గా నమోదైంది. రెండు వారాల వ్యవధిలో మరోసారి అక్కడే భూకంపం రావడం గమనార్హం.

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అణు పరీక్షలు నిర్వహించిందేమో అనే అనుమానాలు వచ్చాయి. అణు పరీక్షలు నిర్వహించిన ప్రాంతంలో స్వల్ప తీవ్రతతో భూమి కంపిస్తుంది. బుషెహ్ ప్లాంట్ సమీపంలోనే భూకంపం రావడంతో న్యూక్లియర్ టెస్టులు ఏమైనా జరిగాయా అని ఆరా తీశారు. ఐతే, ఈ భూకంపం ప్రకృతి సహజంగా వచ్చిన భూకంపమే అని అమెరికా సైంటిస్టులు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story