ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధం తప్పదా?

ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధం తప్పదా?

iran-and-america

ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధం తప్పేలా లేదు. ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. ఇరాక్ లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బలగాలు క్షిపణులతో దాడికి దిగాయి. ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్ లక్ష్యంగా ఈ దాడులు జరిపింది. పశ్చిమ ఆసియా నుంచి అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరాన్ హెచ్చరించింది.

ఇరాక్‌లోని ఆల్ అసద్, ఇర్బిల్ ఎయిర్బేస్ లపై డజనుకుపైగా క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. ఎయిర్ బేస్‌లపై దాడిని పెంటగాన్ ధ్రువీకరించింది. దాడిలో జరిగిన నష్టంపై అమెరికా అంచనా వేస్తోంది. క్షిపణి దాడులను అమెరికా అధ్యక్షుడు ఖండించారు. తాజా పరిస్థితులపై ట్రంప్ స్వయంగా సమీక్షిస్తున్నారని, సరైన సమయంలో బదులిస్తామని అమెరికా రక్షణశాఖ ప్రకటించింది. దాడులపై పూర్తి నివేదికను ట్రంప్ కు సమర్పించామని, ఆయన తదుపరి చర్యలు తీసుకుంటారని వైట్ హౌస్ వెల్లడించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story