కలిసివచ్చే వారిని కలుపుకుపోతాం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కలిసివచ్చే వారిని కలుపుకుపోతాం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

komati

టీఆర్ఎస్ పార్టీలో ఎన్నో గ్రూపులు ఉన్నాయని.. కాంగ్రెస్ పార్టీ మాత్రం కార్యకర్తల మీదనే ఆధారపడిందన్నారు భువనగిరి ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయలేమని స్వయాన కేటీఆర్ అన్నారని ఆయన గుర్తుచేశారు. నార్కట్ పల్లిలో చిట్యాల మున్సిపల్ ఎన్నికల ముఖ్యకార్యర్తల సమావేశంలో పాల్గొన్నఎంపి, పోటీ చేసే అభ్యర్ధుల వివరాలపై ఆరా తీశారు. తమతో కలిసివచ్చే పార్టీలతో పొత్తుకు సిద్దమని, టీఆర్ఎస్ పార్టీ ఓటమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రాన్నిఅప్పుల పాలు చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తగిన బుద్దిచెప్పాలన్నారు. టికెట్ ఎవరికిచ్చినా గెలుపే ధ్యేయంగా పనిచేయాలని కోమటిరెడ్డి పార్టీ కార్యకర్తలకు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story